బాలయ్య నిర్మాతలకు షాకిచ్చింది

బాలయ్య నిర్మాతలకు షాకిచ్చింది

హీరోయిన్​గా టాలీవుడ్​లో ఓ వెలుగు వెలిగిన తమన్నా.. ఇప్పుడు స్పెషల్​ సాంగ్స్​పై ఫోకస్​ పెట్టింది. అనిల్​ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ మాస్ మసాలా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్​ అగర్వాల్​, శ్రీలీల వంటి గ్లామరస్​ తారలను సెలక్ట్​ చేసుకున్నారు మేకర్స్. ఇప్పుడు తమన్నాతో ఓ స్పెషల్​ సాంగ్​ చేయించేందుకు ప్లాన్​ చేస్తున్నారట.

అయితే, అప్పుడే తమన్నాపై కొత్త రూమర్​ వినిపిస్తోంది. ఈ పాట కోసం ఏకంగా కోటిన్నర డిమాండ్​ చేసి నిర్మాతలకు షాకిచ్చిందని టాక్​. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ స్టార్​ హీరోలతో స్పెషల్​ సాంగ్స్​ కి తమన్నా బెస్ట్​ చాయిస్​గా మారింది. ఇప్పటికే జూనియర్​ ఎన్టీఆర్​, మహేశ్​ బాబు, యష్​ వంటి  హీరోలతో స్టెప్పులేసి అదరగొట్టింది. ఇప్పుడు బాలయ్యతో తమన్నా కాంబో అంటే ఫ్యాన్స్​ ను ఏ రేంజ్​లో ఊపేస్తుందో వేచి చూడాలి.