V6 News

రోడ్డు వేస్తేనే ఓటేస్తాం.. రోడ్డు, తాగునీటి కోసం తండా వాసుల ఆందోళన

రోడ్డు వేస్తేనే ఓటేస్తాం.. రోడ్డు, తాగునీటి కోసం తండా వాసుల ఆందోళన
  • గుబ్బేటి తండావాసుల ఆందోళన

రాయపర్తి, వెలుగు: తమ తండాకు రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పిస్తేనే ఓటేస్తామని వరంగల్​ జిల్లా రాయపర్తి శివారులోని గుబ్బేటి తండావాసులు మంగళవారం ఆందోళనకు దిగారు. 60 ఏళ్లుగా రోడ్డు, తాగునీటి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

 పాలకులు తమ తండాకు చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాలో 45 ఓట్లు ఉన్నాయని, తమ తండాకు సౌలతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన వారికే ఓటు వేస్తామని స్పష్టం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు తండాకు చేరుకొని సమస్యలు పరిష్కరిస్తామని ఓటింగ్​లో పాల్గొనాలని కోరారు. గ్రామస్తులు రవి, శంకర్  తదితరులు పాల్గొన్నారు.