థ్యాంక్యూ ఇండియా..మా దేశానికి దక్కిన అరుదైన గౌరవమిది : మెక్రాన్

థ్యాంక్యూ ఇండియా..మా దేశానికి దక్కిన అరుదైన గౌరవమిది :  మెక్రాన్

న్యూఢిల్లీ : 75వ ఇండియన్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడం తమ దేశానికి దక్కిన గొప్ప గౌరవం అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ అన్నారు. దేశ ప్రజలకు ఛబ్బీస్ జనవరి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో దిగిన ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేస్తూ.. ఇండియాకు థ్యాంక్స్ చెప్పారు. కర్తవ్యపథ్​లో శుక్రవారం నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో కలిసి మెక్రాన్ చీఫ్ గెస్ట్​గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ మిలటరీ పరేడ్, కల్చర్ ప్రోగ్రామ్స్, శకటాల ప్రదర్శనను చూశారు. వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రెండు దేశాల ఫ్రెండ్​షిప్​కు ఇది నిదర్శనమని తెలిపారు. ఇండియాతో ఉన్న అసాధారణ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి వచ్చానని చెప్పారు. యువతను ఒకచోట చేర్చడమే తన మొదటి లక్ష్యం అని తెలిపారు.

ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్​కు రండి..

ఇండియన్ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మన స్టూడెంట్స్​కు గుడ్ న్యూస్ చెప్పారు. ఫ్రాన్స్​లో చదువుకోవాలనుకునేవారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. 203‌‌‌‌0 నాటికి 30వేల మంది ఇండియన్ స్టూడెంట్స్​ను తమ దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకునేందుకు ఆహ్వానించాలని  ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.