
- రాహుల్‌తో మాట్లాడిన అనుభవాన్ని పంచుకున్న ఓయూ ప్రొఫెసర్
హైదరాబాద్, వెలుగు: రాహుల్‌గాంధీ ప్రజలు చెప్పింది చాలా శ్రద్ధగా విని అర్థం చేసుకునే వ్యక్తి అని ఓయూ ప్రొఫెసర్రమేశ్వేముగంటి చెప్పారు. శంషాబాద్ఎయిర్పోర్ట్వద్ద రాహుల్‌గాంధీతో ముచ్చటించిన సందర్భాన్ని ఆయన గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘‘రాహుల్‌గాంధీని ఎయిర్‌పోర్టులో కలిశాను. ఆయన నా వృత్తి గురించి అడిగారు. నేను మేనేజ్ మెంట్ టీచింగ్, ఐటీ మార్కెటింగ్, కార్పొరేట్ట్రైనింగ్, బంగ్లాదేశ్కన్సల్టెన్సీల గురించి వివరించాను. ఉత్పత్తి లేకపోవడం, యువతలో నైపుణ్యలేమి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు అని ఆయనతో చెప్పాను. నేను చెప్పింది ఆయన చాలా శ్రద్ధగా విన్నారు.
చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఎదుటి వారి పట్ల రాహుల్ఎంతో గౌరవంగా ఉంటారు. ఆప్యాయంగా మాట్లాడుతారు. మరోసారి వచ్చినప్పుడు ఓ పారిశ్రామికవేత్త ఫ్యాక్టరీని సందర్శిస్తానని రాహుల్ మాటిచ్చారు. సాఫ్ట్వేర్ఇండస్ట్రీ, ఏవియేషన్ రంగంలోని ప్రతికూలతలు, ఇంజనీరింగ్‌వంటి విషయాలపై వివిధ వర్గాల వారితో ఆయన మాట్లాడారు. రాహుల్‌తో మాట్లాడాలని నేను ఆసక్తి చూపించినప్పుడు రేవంత్లేచి నాకు సీటిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి పట్ల గౌరవం ప్రదర్శిస్తూ ఇతర నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి కోసం నేను తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తున్నాను’’ అని రమేశ్వేముగంటి రాహుల్‌తో మాట్లాడిన తన అనుభవాన్ని పంచుకున్నారు.