
న్యూఢిల్లీ: వన్డేల్లో డబుల్‌సెంచరీ చాలా అరుదైన విషయం. కానీ, టీమిండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ మాత్రం చాలా ఈజీగా బాదేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ‘డబుల్’ ధమాకా మోగించి రికార్డు సృష్టించాడు. 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకపై చేసిన మూడో డబుల్‌సెంచరీ అతనికి మరింత స్పెషల్. ఎందుకంటే ఆ రోజు అతని మ్యారేజ్‌డే. రోహిత్200 మార్కు దాటినప్పుడు స్టాండ్స్‌లో ఉన్న అతని భార్య రితికా సజ్‌దే ఏడుస్తూ కనిపించింది. తాను ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సమయాన ఆమె కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఏమిటో హిట్‌మ్యాన్‌వెల్లడించాడు. ‘నేను ఆ మైలురాయికి చేరుకున్నప్పుడు నా వైఫ్‌ఎమోషనల్‌అయింది. మా వెడ్డింగ్‌యానివర్సరీ రోజు సాధించింది కాబట్టి ఈ ఇన్నింగ్స్‌నాకు చాలా స్పెషల్. పెళ్లి రోజు నా భార్యకు ఇవ్వగలిగిన బెస్ట్‌గిఫ్ట్‌కూడా ఇదే.
డబుల్‌సెంచరీకి ముందు 196 రన్స్‌వద్ద సింగిల్ తీసే క్రమంలో నేను డైవ్‌చేయడంతో రితిక చాలా కంగారు పడింది. డైవ్‌చేసినప్పుడు నా చేయి బెణికిందేమోనని భయపడింది. అందుకే నా డబుల్‌సెంచరీ పూర్తి కాగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది’ అని టీమ్‌మేట్స్‌శిఖర్‌ధవన్, మయాంక్‌అగర్వాల్‌తో కలిసి బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక, స్టార్టింగ్‌లో స్లోగా ఆడడంతో తాను మరో డబుల్‌సెంచరీ చేస్తానని అనుకోలేదని చెప్పాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఆ మ్యాచ్‌లో నేను చాలా స్లోగా ఆడాను. డబుల్‌సెంచరీ చేస్తానని అస్సలు అనుకోలేదు. కానీ, 125 రన్స్‌దాటిన తర్వాత కాస్త ఈజీగా అనిపించింది. ఎందుకంటే అప్పటికే బౌలర్లు ఒత్తిడిలో ఉన్నారు. ఆ టైమ్‌లో నేను మిస్టేక్ చేస్తే తప్ప ఔట్‌కానని నాకు తెలుసు’ అని చెప్పుకొచ్చాడు.
అంతా విని.. ఏం చెప్పావు అంటున్నా
లాక్‌డౌన్‌లో తన శరీరం ఒక చోట, మనసు మరో చోట ఉందని భార్య రితిక గుర్తించిందని రోహిత్‌చెప్పాడు. ‘ఈ టైమ్‌లో ఇంట్లో సరుకుల గురించే మేం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఈ కూరగాయలు అయిపోయాయి. ఆ వస్తువు లేదు అని రితిక మొత్తం లిస్ట్‌చెబుతుంది. కానీ, ఆ సమయంలో నేను ఆమె చెప్పేది వింటా కానీ వేరే విషయాల గురించి ఆలోచిస్తుంటా. అందువల్ల సరే.. అన్నీ తెప్పిస్తున్నాలే అని ఆ కన్వర్జేషన్‌ను ముగిస్తా. నాకు చెప్పింది కాబట్టి సామాను వస్తుందని రితిక భావిస్తుంది. కానీ, ఎంత సమయమైనా రాకపోవడంతో ఏమైంది.. ఆర్డర్‌చేశావా? లేవా? అని ఆమె అడిగితే.. నేనేమో ఏ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు? అని ఎదురు ప్రశ్నిస్తుంటా. ఇలా చాలా సార్లు జరగడంతో రితిక చాలా ఫ్రస్ట్రేట్‌అయ్యింది. అలాగే, నాకు చేతి గోళ్లు కొరికే బ్యాడ్‌హ్యాబిట్‌ఉంది. దీన్ని రితిక నోటీస్‌చేసింది. చాలా వరకు కంట్రోల్‌చేశా గానీ..ఈ అలవాటును పూర్తిగా మానేయాలి’ అని రోహిత్‌పేర్కొన్నాడు.
ఈ రోజులు మళ్లీ రావు
క్రికెట్‌తో ఎప్పుడూ బిజీగా గడిపే రోహిత్.. కరోనా కారణంగా వచ్చిన ఫోర్స్‌డ్‌బ్రేక్‌ను తన ఫ్యామిలీతో బాగా ఎంజాయ్‌చేస్తున్నాడు. తన చిన్నారి కూతురు సమైరాతో విలువైన సమయం గడుపుతున్నాడు. ఆమెతో ఆడుకుంటు న్న వీడియోను శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌అకౌంట్‌లో పోస్ట్‌చేసిన హిట్‌మ్యాన్ ‘ఈ రోజులు మళ్లీ రావు’ అని క్యాప్షన్‌ఇచ్చాడు. ట్రంపోలిన్‌పై పడుకున్న రోహిత్.. చిరునవ్వులు చిందిస్తున్న కూతురును ఆడిస్తున్న వీడియోను రితిక తన మొబైల్‌తో
షూట్‌చేసింది.