ప్రపంచంలోనే ధనవంతుడు.. ఇతని ముందు మస్క్, జుకర్‌బర్గ్, అంబానీ, అదానీ సరిపోరు!

ప్రపంచంలోనే ధనవంతుడు.. ఇతని ముందు మస్క్, జుకర్‌బర్గ్, అంబానీ, అదానీ సరిపోరు!

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల లిస్టులో ఎలాన్ మస్క్, జుకర్‌బర్గ్, అంబానీ, అదానీ, టాటాల పేర్లు తరచుగా వినిపిస్తాయి. కానీ వీరందరినీ మించిపోయి కుబేరుడు శతాబ్దాల క్రితం ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తి ఒక ఆఫ్రికా చక్రవర్తి అని మనలో చాలా మందికి అస్సలు తెలుసా? ఆయన పేరే మంసా మూసా. అతని సంపద విలువ అప్పట్లోనే 131 బిలియన్ డాలర్లుగా తెలుస్తోంది.

మంసా మూసా 1312లో మాలీ సామ్రాజ్య సింహాసనం అధిష్టించాడు. తన సోదరుడు అట్లాంటిక్ సముద్ర ప్రయాణంలో అదృశ్యమవడంతో ఆయన రాజ్యానికి అధిపతిగా ఎదిగాడు. మూసా పాలనలో మాలీ సామ్రాజ్యం బంగారం, ఉప్పు వంటి అమూల్యమైన సహజ వనరులతో నిండిపోయింది. అప్పుడు ప్రపంచ బంగారం నిల్వల్లో దాదాపు 50 శాతం మాలీకి చెందినవే. అఫ్రికా నుంచి యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య వ్యాపారానికి మాలీ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. 

కేవలం సంపద విషయంలోనే కాదు మంసా దాతృత్వంలోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. మంసా మూసా చేసిన మక్కా ప్రయాణం చరిత్రలో నిలిచిపోయింది. ఆయనతోపాటు దాదాపు 12వేల మంది సిబ్బంది, 100 ఒంటెల మీద బంగారం, వేలమంది దాస్య స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారని చరిత్రకారులు చెబుతున్నారు. సుమారు 18 టన్నుల బంగారాన్ని ఆయన ఈ యాత్రలో తీసుకెళ్లాడంట. ఇది నేటి విలువలో దాదాపు 957 మిలియన్ డాలర్లకు సమానం.

►ALSO READ | RCB కొనుగోలు రేసులో కాంతారా, KGF నిర్మాత : కర్నాటక బ్రాండ్ దిశగా అడుగులు

మార్గమధ్యంలో మంసా చేసిన దానధర్మాల కారణంగా కొంతకాలం పాటు ఈజిప్ట్, మక్కా ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. ఆయన తన సంపదను ప్రజల సంక్షేమానికి వినియోగించడమే కాదు.. జ్ఞానానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. మాలీ రాజధాని టింబుక్టూ నగరంలో విశ్వవిద్యాలయాలు, మసీదులు, విద్యాకేంద్రాలను నిర్మించి ఆఫ్రికా కుబేరుడిగా గర్వంగా నిలిచాడు. అందుకే నేటికీ ఆయన పేరు ఆఫ్రికా స్వర్ణయుగానికి ప్రతీకగా నిలుస్తోంది.