వచ్చే నెల 3 నుంచి 7 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు

వచ్చే నెల 3 నుంచి 7 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు

చ్చే నెల 3 నుండి 7వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిర్వహించబోయే సీపీఐ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి  నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర 3వ మహాసభలు ఆహ్వానం సంఘం ఏర్పాటు కోసం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీఐ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అదానీ, అంబానీలకు అప్పగించడానికి నిరంతరం కృషి చేస్తోందంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేశారని విమర్శించారు. అమిత్ షా తెలంగాణలో పర్యటించే ముందురోజు కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటుపరం చేశారన్నారు. కేంద్రంపై పోరాటం చేసే అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన