50 శాతం సీలింగ్ ఈడబ్ల్యూఎస్‌కు ఎందుకు అడ్డు రాలే ?

50 శాతం సీలింగ్ ఈడబ్ల్యూఎస్‌కు ఎందుకు అడ్డు రాలే ?

ఓయూ, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అడ్డు అంటున్న 50 శాతం సీలింగ్.. ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు ఇచ్చినప్పడు ఎందుకు అడ్డు రాలేదో చెప్పాలని ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు డిమాండ్​ చేశారు. బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్, బీసీ జేఏసీ కో చైర్మన్ గుజ్జ సత్యంతో కలిసి ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద రెండోరోజు బుధవారం చేపట్టిన విద్యార్థుల దీక్షకు మద్దతు తెలిపారు.