ముషీరాబాద్, వెలుగు: జస్టిస్బీఆర్ గవాయ్పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి బషీర్బాగ్లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై ర్యాలీని ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
