ఎలాన్ మస్క్ కొత్తపార్టీ ‘‘ది అమెరికన్ పార్టీ’’! 80శాతం అమెరికన్ల సపోర్టు

ఎలాన్ మస్క్ కొత్తపార్టీ ‘‘ది అమెరికన్ పార్టీ’’! 80శాతం అమెరికన్ల సపోర్టు

ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అతను ఇటీవల తన X(గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక పోల్ నిర్వహించారు. అందులో అమెరికాలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ఇది సమయమా?" అని అడిగారు. ఈ పోల్‌కు అమెరికన్లనుంచి అనూహ్య స్పందన లభించింది. దాదాపు 80% మంది కొత్త పార్టీకి మద్దతు పలికారు.ఇది డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్‌కు ఉన్న విభేదాల నేపథ్యంలో చోటు చేసుకుంది. 

గతంలో ట్రంప్‌కు మద్దతుగా ఉన్న మస్క్..ఇటీవల ట్రంప్ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన కొన్ని విధానాలను విమర్శించారు. దీనిపై ట్రంప్ కూడా మస్క్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మస్క్ కొత్త పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.

అయితే మస్క్ పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికన్ ప్రజలు.. పార్టీ పేరును కూడా సూచించారు. మస్క్ పార్టీకి "ది అమెరికా పార్టీ" (The America Party) అనే పేరును నెటిజన్లు సూచించారు. మస్క్ దానికి సానుకూలంగా స్పందించారు. 

యితే ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం..దానిని విజయవంతం చేయడం అనేది అంత తేలికైన పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ఆలోచన దశలో మాత్రమే ఉంది.పార్టీ ఏర్పాటుపై ఎలాన్ మస్క్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.