తుదిదశకు సమ్మక్క సాగర్‌‌‌‌‌‌‌‌ అనుమతుల ప్రక్రియ

తుదిదశకు సమ్మక్క సాగర్‌‌‌‌‌‌‌‌ అనుమతుల ప్రక్రియ
  • సమ్మక్క సాగర్‌‌‌‌‌‌‌‌ అనుమతుల ప్రక్రియ తుది దశకు
  • టీఏసీకి చేరిన చిన్న కాళేశ్వరం, చౌట్‌‌‌‌‌‌‌‌పల్లి హన్మంతరెడ్డి, చనాకా కొరాట
  • మోడికుంటవాగు, గూడెం ఎత్తిపోతల డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు ముందుకు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కొలిక్కి వస్తున్నది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన నీటి లభ్యత (హైడ్రాలజీ) క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. దీంతో మిగతా క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌లు కూడా త్వరలోనే వస్తాయని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లు చెప్తున్నారు. సమ్మక్క సాగర్‌‌‌‌‌‌‌‌ (తుపాకులగూడెం) బ్యారేజీ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ల ప్రక్రియ తుదిదశకు చేరింది. ఇప్పటికే చిన్న కాళేశ్వరం, చౌట్‌‌‌‌‌‌‌‌పల్లి హన్మంతరెడ్డి, చనకా–కొరాట ప్రాజెక్టులకు గోదావరి బోర్డు క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి సీడబ్ల్యూసీలోని టెక్నికల్‌‌‌‌‌‌‌‌ అడ్వైజరీ కమిటీ (టీఏసీ)కి పంపేందుకు ఓకే చెప్పింది. ఇటీవల మోడికుంటవాగు, గూడెం లిఫ్ట్ స్కీంల డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు సైతం తుది దశకు చేరుకున్నాయి.

ఏపీ ఒత్తిడి తెచ్చినా?

కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దారిస్తూ నిరుడు జులై 15న గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. ఇందులో అన్‌‌‌‌‌‌‌‌ అప్రూవుడ్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులుగా పేర్కొన్న వాటి డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు సమర్పించి ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని నిర్దేశించింది. ఆరునెలల్లో పర్మిషన్‌‌‌‌‌‌‌‌ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో కేంద్ర జలశక్తి శాఖ ఆ గడువును ఇంకో ఆరు నెలలు పొడిగించింది. ఈ లెక్కన వచ్చే నెల 14వ తేదీలోగా పర్మిషన్‌‌‌‌‌‌‌‌ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీతారామ సహా ఏడు ప్రాజెక్టులకు డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు గోదావరి బోర్డుకు, సీడబ్ల్యూసీకి సమర్పించింది. ఈ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. రూ.11,341 కోట్లతో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల ఇందులో పెద్దది. దీనికి అనుమతులు ఇవ్వొద్దని సీడబ్ల్యూసీ అధికారులపై ఏపీ ఒత్తిడి తెచ్చింది. ఈ ప్రాజెక్టుకు హైడ్రాలజీతో పాటు ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ ఇతర డైరెక్టరేట్ల అనుమతులు వచ్చాయని అధికారుల చెప్తున్నారు. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతులు కూడా త్వరలోనే వస్తాయని అధికారులు చెప్తున్నారు. సమ్మక్క సాగర్‌‌‌‌‌‌‌‌ బ్యారేజీ, మంథని ప్రాంతానికి నీటిని ఇచ్చే చిన్న కాళేశ్వరం, ఎస్సారెస్పీ మీద నిర్మించిన చౌట్‌‌‌‌‌‌‌‌పల్లి హన్మంత రెడ్డి లిఫ్ట్, తెలంగాణ, మహారాష్ట్రల కామన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు చనాకా–కొరాట, మోడికుంటవాగు ప్రాజెక్టు డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు సీడబ్ల్యూసీకి సమర్పించారు. కాళేశ్వరం అడిషనల్‌‌‌‌‌‌‌‌ టీఎంసీ మరికొన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు సమర్పించాల్సిన అవసరం లేదని పలుమార్లు గోదావరి బోర్డుకు, సీడబ్ల్యూసీకి దృష్టికి తీసుకెళ్లింది.

టీఏసీకి డీపీఆర్​లు

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 27న నిర్వహించిన గోదావరి బోర్డు 13వ సమావేశంలో చిన్న కాళేశ్వరం లిఫ్ట్‌‌‌‌‌‌‌‌, చౌట్‌‌‌‌‌‌‌‌పల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌, చనకా కొరాటా ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌‌‌‌‌లపై చర్చించారు. ఈ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఏపీలోనే చేపట్టి పూర్తి చేశామని, సీడబ్ల్యూసీ ఫ్లో చార్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం తదుపరి అనుమతులకు పంపాలని తెలంగాణ పట్టుబట్టింది. తెలంగాణ వాదనతో ఏకీభవించిన బోర్డు చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎంపీ సింగ్‌‌‌‌‌‌‌‌ ఈ మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు టీఏసీకి పంపేందుకు అంగీకారం తెలిపారు. తాజాగా మోడికుంటవాగు, గూడెం ఎత్తిపోతల డీపీఆర్‌‌‌‌‌‌‌‌లకు సీడబ్ల్యూసీలోని పలు డైరెక్టరేట్ల నుంచి క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఆ రెండు డీపీఆర్‌‌‌‌‌‌‌‌లపై త్వరలోనే గోదావరి బోర్డు సమావేశంలో చర్చించి టీఏసీ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ కోసం పంపనున్నారు.