మెదక్‌ పట్టణానికి దూరంగా వైకుంఠధామం

మెదక్‌ పట్టణానికి దూరంగా వైకుంఠధామం
  • రూ.2 కోట్లు పెట్టి.. 3 కి.మీ. దూరంలో నిర్మాణం
  • అదీ గ్రౌండ్​ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు10 ఫీట్ల లోతుగా ఉన్న స్థలంలో..
  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నేతలు 


మెదక్/ మెదక్ టౌన్​, వెలుగు:జిల్లా కేంద్రమైన మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఖరి మజిలీకి అవస్థలు తప్పడం లేదు. ఎవరైనా చనిపోతే దహనం, ఖననం చేసేందుకు కనీస వేదిక, సరైన స్థలం ఉండడం లేదు.  ఖిల్లా దిగువన ఉన్న గిద్దకట్ట శ్మశాన వాటిక ఉన్నా.. అది పట్టణానికి చాలా దూరం అవుతోంది. పైగా అక్కడ కనీస వసతులు కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు మల్లెం చెరువు కట్ట కింద, దాయర వీధి నుంచి గాంధీనగర్​వెళ్లే దారిలో దహన సంస్కారాలు నిర్వహిస్తూ వస్తున్నారు.  అక్కడా సౌకర్యాలు లేకపోవడం, పైగా అవి ఏమాత్రం సరిపోకపోవడం లేదు.  దీంతో ప్రభుత్వం రెండేళ్ల కింద ఆధునిక హంగులతో వైకుంఠధామం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది.  

స్థలం గుర్తించక ముందే మంత్రి శంకుస్థాపన

మెదక్ పట్టణంలో వైకుంఠ ధామం నిర్మాణానికి  స్థలం ఎంపిక జరగక ముందే మంత్రి హరీశ్ రావు 2021 జూన్​ 24న శంకుస్థాపన చేశారు. ​ కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్​ వద్ద ఇందుకు సంబంధించిన శిలా ఫలాకాన్ని ఆవిష్కరించారు.  ఆ తర్వాత మున్సిపల్ అధికారులు స్థలం ఎంపిక కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.  ఎట్టకేలకు పట్టణ శివారులోని దుబ్బతోట ఏరియాలో స్థలాన్నిఎంపిక చేసి కొన్నినెలల కింద పనులు మొదలు పెట్టారు.   

టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాలా దూరంగా...

వైకుంఠ ధామం నిర్మిస్తున్న ప్రాంతం మెదక్ పట్టణానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.  మెదక్​ నుంచి మండలంలోని మక్త భూపతిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లే రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లా చెరువు దాటిన తర్వాత రోడ్డు నుంచి లోపలికి దాదాపు కిలోమీటరున్నర వెళ్లాలి.  బంగ్లా చెరువు వరకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా, అక్కడి నుంచి వైకుంఠ ధామం నిర్మిస్తున్నచోటుకు రోడ్డు సౌకర్యం కూడా లేదు. పైగా వైకుంఠ ధామం నిర్మిస్తున్న గ్రౌండ్​ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 10 ఫీట్లకుపైగా లోతులో ఉండడం గమనార్హం.

మెదక్​ రైల్వేలైన్​ నిర్మాణం కోసం గతంలో దుబ్బతోట ప్రాంతంలో నుంచి వేల ట్రిప్పుల మట్టి తవ్వి తరలించారు.  ఇప్పుడు అదే ప్రాంతంలో వైకుంఠ ధామం నిర్మిస్తున్నారు.  ఇప్పటికే వేసిన స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రోడ్డు లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్నాయి.   వర్షాకాలం వస్తే జలమయం అయ్యే ప్రమాదం ఉందని, అధికారులు రూ.2 కోట్లు వృథా చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. వెంటనే స్థలాన్ని మార్చాలని, లేదా ఆ ప్రాంతాన్ని రోడ్డు లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మట్టితోనైనా నింపాలని సూచిస్తున్నారు.  

స్థలం దొరకలేదు

పట్టణ పరిధిలో వైకుంఠ ధామం నిర్మాణానికి అనువైన స్థలం దొరక లేదు. నాలుగైదు సైట్​ లు చూశాం. అయితే ఆయా చోట్ల వైకుంఠ ధామం నిర్మాణానికి సమీప ప్రాంతాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఒకచోట అయితే పనులు మొదలు పెట్టాక క్యాన్సల్​ చేయాల్సి వచ్చింది. చివరగా దుబ్బతోటలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఫైనల్​ చేసి  పనులు మొదలు పెట్టాం.  నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోగా  పనులు పూర్తి చేస్తాం. 
–జానకీ రాంసాగర్, మున్సిపల్​ కమిషనర్​