హైదరాబాద్ లో టూ లెట్​ బోర్డు ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలు

హైదరాబాద్ లో టూ లెట్​ బోర్డు ఉన్న ఇళ్లే  టార్గెట్  గా చోరీలు
  • వృద్ధురాలిని తాళ్లతో కట్టేసి..నగలు, నగదు దోపిడీ
  • టూ లెట్​ బోర్డు చూసి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు

పద్మారావునగర్, వెలుగు: వారాసిగూడ పరిధిలోని పార్సిగుట్టలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ ఇంట్లో వృద్ధురాలిని తాళ్లతో కట్టేసి నగదు, నగలు ఎత్తుకెళ్లారు. స్థానికులు వివరాల ప్రకారం.. పార్సిగుట్టకు చెందిన పారిజాతం అనే వృద్ధురాలు తన ఇంటి ముందు టూ లెట్​బోర్డు పెట్టింది. దీంతో అద్దె కోసమని ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. వృద్ధురాలు ఒంటరిగా ఉండడం గమనించి, ఆమెను బెడ్రూంలో తాళ్లతో కట్టేసి, నోటికి ప్లాస్టర్​వేశారు. ఆపై కత్తితో బెదిరించి, మూడు తులాల బంగారు నగలు, రూ. ఆరు వేల నగదు, ఒక మొబైల్ ​ఫోన్​ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.