'టీ' తాగటం వల్ల కలిగే లాభాలివే

'టీ' తాగటం వల్ల కలిగే లాభాలివే

టీ (Tea) తాగడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయన్న విషయం చాలా మందికి తెలిసిన విషయమే. కానీ తాగడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.(International Tea Day)

'టీ' తాగటం వల్ల కలిగే లాభాలివే :

టీ తాగడం వల్ల కలిగే నష్టాల కంటే తాగకపోవడం వల్ల కలిగే లాభాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

  •     అజీర్తి సమస్యను నివారిస్తుంది.
  •     నెలసరి సమయంలో కడుపు, నడుము నొప్పితో బాధపడే మహిళలు ఓ కప్పు యాలకులతో కలిపి తయారు చేసుకున్న టీ తాగితే ఉపశమనం కలిగిస్తుంది.
  •     టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. అలసట, ఒత్తిడి మటుమాయమవుతుంది.
  •     హెర్బల్ టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు.
  •     రోజుకి రెండు కప్పుల టీ తాగడం వల్ల చిగుళ్లలో క్యావిటీస్ ని అరికట్టవచ్చు.
  •     పుదీనా, గ్రీన్ టీ తాగడం వల్ల అలర్జీల నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది.
  •     గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్, బరువు తగ్గడం వంటి వాటిని ఇది నిరోధిస్తుంది.
  •     టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడుతుంది.
  •     టీ జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

కాబట్టి మితంగా టీ తాగితే టీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. టీ పాడైన జీవ కణాలను ఉత్తేజపరచటంతో పాటు జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాదు రోజుకు రెండు కప్పులకు మించి టీ తాగడం మాత్రం మంచిది కాదన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.