జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు కార్మికుల ఆందోళన 

జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు కార్మికుల ఆందోళన 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

బల్దియా హెడ్డాఫీసు వద్ద కార్మికుల ఆందోళన 

సికింద్రాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బల్దియా హెడ్డాఫీసు వద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్పొరేటర్లు సైతం పాల్గొని వీరి ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం బీజేపీ మజ్దూర్ సెల్ సిటీ చైర్మన్ ఊదరి గోపాల్ మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. వెంటనే ఉద్యోగులను పర్మినెంట్ చేసే ప్రాసెస్​ను మొదలుపెట్టేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు.

ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతం రూ.25 వేలకు పెంచాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్​లో ఉన్న 3 డీఏలు, పీఆర్సీ ఇంక్రిమెంట్​ను వెంటనే చెల్లించాలన్నారు. ధర్నా అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ ను కలిసి పలు డిమాండ్లతో ఉన్న వినతిపత్రాన్ని అందజేశారు. ఆందోళనలో యూనియన్ నాయకులతో పాటు కార్పొరేటర్లు వంగ మధుసూదన్ రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, శ్రవణ్ కుమార్, పద్మా వెంకట్ రెడ్డి, ఉమారాణి, ఆకుల శ్రీవాణి పాల్గొన్నారు.