చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు

V6 Velugu Posted on Oct 28, 2021

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ముగ్గురు మహిళలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. జగిత్యాల శివార్లలోని ధర్మసముద్రం చెరువులో డెడ్ బాడీలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతులను  గంగాజల, మల్లిక, వందనగా గుర్తించారు పోలీసులు. జగిత్యాలలోని ఉప్పరపేటకు చెందిన ముగ్గురు మహిళలు నిన్న సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా... అనుమానాస్పద స్థితిలో ముగ్గురి డెడ్ బాడీలు చెరువులో కనిపించాయి.

Tagged Telangana, Jagityal District, Dead bodies, Dharma samudram pond

Latest Videos

Subscribe Now

More News