
హైద్రాబాద్: కొంపల్లిలోని అశోక్ విల్లాస్ నుంచి వైద్యురాలు మైనంపల్లి అనన్య రావ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. అల్వాల్లోని స్మశాన వాటికలో అనన్యరావుకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె అకాల మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అనన్యరావును చివరి చూపులు చూసుకోవడానికి స్నేహితులు, బంధువులు, సన్నిహితులు భారీగా తరలి వెళ్లారు. అనన్య రావు(28) కాంగ్రెస్ నాయకుడు మైనపల్లి హనుమంతరావు సమీప బంధువు. ఫిబ్రవరి 18న ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా కర్నాటక టూర్‌కు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన అనన్య రావు తుంగభద్ర నదిలో పడి చనిపోయింది.
ಈಜಲು ತೆರಳಿದ್ದ ತೆಲಂಗಾಣ ಮೂಲದ ವೈದ್ಯೆ ನೀರಿನಲ್ಲಿ ಮುಳುಗಿ ಸಾವು
— Ballari Tweetz (@TweetzBallari) February 19, 2025
ಗಂಗಾವತಿಯ ಸಾಣಾಪುರ ಗ್ರಾಮದ ತುಂಗಭದ್ರಾ ನದಿಯಲ್ಲಿ ಈಜಲು ಹೋದ ಹೈದರಾಬಾದ್ ಮೂಲದ ಖಾಸಗಿ ಆಸ್ಪತ್ರೆಯ ವೈದ್ಯೆ ನೀರಿನಲ್ಲಿ ಮುಳುಗಿ ಬುಧವಾರ ಮೃತಪಟ್ಟಿದ್ದಾರೆ. ಹೈದರಾಬಾದ್ ಮೂಲದ ನಾಂಪಲ್ಲಿ ನಿವಾಸಿ ಡಾ.ಅನನ್ಯರಾವ್ (26)ಎಂದು ತಿಳಿದು ಬಂದಿದೆ pic.twitter.com/lJV0fxG5de
మేడ్చల్ మల్కాజ్‌గిరి పరిధిలోని సుచిత్ర ప్రాంతానికి చెందిన అనన్యరావు (26) గైనకాలజిస్ట్‌గా పనిచేస్తూ అశోక విల్లాస్లో నివాసం ఉంటోంది. మూడు రోజుల కింద తన ఫ్రెండ్స్ సాత్విన్, హషితతో కలిసి కర్నాటకలోని హంపి టూర్‌కు వెళ్లింది. మంగళవారం రాత్రి సణాపురలోని గెస్ట్‌హౌజ్‌లో బస చేసిన వీరు బుధవారం మధ్యాహ్నం తుంగభద్ర నది వద్దకు వెళ్లి కొద్దిసేపు ఈత కొట్టారు. తర్వాత అనన్యరావు నదికి అనుకొని ఉన్న కొండచరియ పైకి ఎక్కి నీటిలోకి దూకింది.
కొద్దిసేపు ఈత కొట్టిన తర్వాత నీటి ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో బయటకు వచ్చేందుకు యత్నించింది. కానీ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయింది. గమనించిన ఆమె ఫ్రెండ్స్ కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మూడు గంటల పాటు గాలించగా బుధవారం రాత్రి అనన్యరావు డెడ్‌బాడీ దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు గంగావతి పీఎస్ పోలీసులు తెలిపారు.