బడ్జెట్ అనేది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదడంరాం. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్య, వైద్య రంగానికి చాలా తక్కువ శాతం కేటాయిస్తున్నారు ఆరోపించారు. రెవెన్యూ ఖర్చులకు కూడా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. గతంలో కేటాయించిన బడ్జెట్ ఎంత? వాస్తవంగా ఖర్చు చేసింది ఎంతో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించారన్నారు. సభ నుంచి బిజెపి ఎమ్యెల్యే లను సస్పెండ్ చేయడం సరైంది కాదని... వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు కోదండరాం
బడ్జెట్ అనేది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి
‘రాష్ట్రంలో బడ్జెట్ అంటే విలువ లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం..నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ అనుమానాస్పదంగా ఉంది.. అన్ని గాలి లెక్కలు చూపించారు... మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్య, వైద్య ర్యాంగానికి చాలా తక్కువ శాతం కేటాయిస్తున్నారు... రెవెన్యూ ఖర్చులకు కూడా అప్పు తేవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు.. గతంలో కేటాయించిన బడ్జెట్ ఎంత, వాస్తవంగా ఖర్చు చేసింది ఎంతో బయట పెట్టాలి...’ అని కోదండరామ్ అన్నారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలొస్తాయని ఎంతో మంది ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైంది, బడ్జెట్ లో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదని కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు.
టీచర్ల భర్తీ ఎక్కడ.. ప్రతి అంకెకు సమాధానం చెప్పాలి
విద్యా వ్యవస్థలో మౌలిక వసతులకు తప్ప....టీచర్ల భర్తీ గురించి చెప్పలేదని కోదండరామ్ ఆరోపించారు. అలాగే కార్పొరేషన్లకు నిధులు లేవు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించినట్లు కనిపిస్తోందన్నారు. ప్రతి అంకెకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని కోదండరామ్ డిమాండ్ చేశారు. సభ నుండి బిజెపి ఎమ్యెల్యే లను సస్పెండ్ చేయడం సరైంది కాదని ఆయన ఖండించారు. బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధికి సంబంధించిన ప్రస్తావన బడ్జెట్ లో లేదు, ముందుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల అనుమతి తీసుకోవాలన్నారు. ఎంతో కొంత బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకోవడం సరైంది కాదని, రైతు బందు, భీమా, లాంటి పథకాలకు తప్ప వ్యవసాయరంగంలో మిగతా వాటికి కేటాయింపులు లేని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
