మళ్లీ మొరాయించిన ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్

మళ్లీ మొరాయించిన ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్

హైదరాబాద్ : ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ మళ్లీ రోడ్డుపై మొరాయించింది. నిన్న రాజాసింగ్ శంషాబాద్ నుంచి తన ఇంటికి వాహనంలో వెళ్తుండగా పురానాపూల్ సర్కిల్ వద్ద ఆగిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ప్రభుత్వం తనకు కేటాయించిన వెహికల్ ఇప్పటికే ఐదోసార్లు రోడ్డు మీద ఆగిపోయిందని వాపోయారు.

బీఆర్ఎస్ ఎమ్మె్ల్యేలు, మంత్రులకు మంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను ఇచ్చిన సర్కార్.. తనకు పాడైన వెహికల్ ఇచ్చిందని ఆరోపించారు. ఈ వెహికల్ ను వాపస్ తీసుకోవాలని పోలీసులను కోరినా.. స్పందించడం లేదని చెప్పారు. తనకు పాడైన వాహనాన్ని ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ వాపోయారు.