ఇటీవలే ఎంగేజ్​మెంట్: ఆగిన బైక్​ను ఢీ కొట్టిన కారు.. యువతి మృతి

V6 Velugu Posted on Oct 04, 2021

  • సిగ్నల్ దగ్గర ఆగిన బైక్​ను ఢీ కొట్టిన కారు
  • యువతి మృతి.. యువకుడికి తీవ్రగాయాలు
  • వీరికి నెల కిందట ఎంగేజ్​మెంట్.. త్వరలో పెండ్లి

మాదాపూర్, వెలుగు: త్వరలో పెండ్లి చేసుకోవాల్సిన జంట బైక్​పై వెళ్తుండగా కారు ఢీ కొట్టడడంతో యువతి చనిపోగా, యువకుడికి తీవ్రగాయాలైన ఘటన మాదాపూర్​లో జరిగింది. నేరేడ్​మెట్​కు చెందిన టి. అజయ్​(23), సైనిక్​పురికి చెందిన జెన్నిఫర్​మరియా డిక్రూజ్​(23) ఫ్రెండ్స్. వేర్వేరు కంపెనీల్లో ఐటీ ఎంప్లాయీస్.​వీరికి నెల రోజుల కిందట పెద్దలు ఎంగేజ్​మెంట్ చేశారు. ఆదివారం ఉదయం7.10 గంటల సమయంలో ఇద్దరూ కలిసి రాయల్​ఎన్​ఫీల్డ్​బైక్​(టీఎస్​08హెచ్​ఏ8739)పై కొత్తగూడ నుంచి సైబర్​టవర్స్​ వైపు వెళ్తూ  గూగుల్ ఆఫీస్ వద్ద  సిగ్నల్​పడగా ఆగారు. కొత్తగూడ నుంచి స్పీడ్​గా వచ్చిన కారు(టీఎస్​08ఎఫ్​యూ5618) బైక్​ను వెనుక నుంచి ఢీకొట్టింది.  బైక్​వెనకాల కూర్చున్న జెన్నిఫర్​తలకు తీవ్రగాయాలవగా స్థానిక  ఆస్పత్రికి  తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.  బైక్​ డ్రైవ్​చేసిన అజయ్​ రెండు కాళ్లు, వెన్నెముకకు బలమైన గాయాలై ట్రీట్​మెంట్​తీసుకుంటున్నాడు. మృతురాలి తండ్రి జాన్​ సిరిల్​ డిక్రూజ్​కంప్లయింట్​చేయగా​ కేసు ఫైల్​ చేశామని మాదాపూర్ ఇన్​స్పెక్టర్​రవీంద్ర ప్రసాద్​ తెలిపారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. 

Tagged Hyderabad, Died, Young woman, car accident,

Latest Videos

Subscribe Now

More News