కార్వీ కేసులో ఈడీ దూకుడు

కార్వీ కేసులో ఈడీ దూకుడు

కార్వీ సంస్థ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ  కేసుకు సంబంధించి విచారణకు వేగవంతం చేసింది.చంచల్ గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి కార్వీ ఎండీ పార్థసారథి తరలించారు. ఈడీ కార్యాలయంలో పార్థసారథిని ప్రశ్నిస్తున్నారు అధికారులు.కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పీపీఈ కిట్లు వేసి పార్థసారథిని విచారిస్తున్నారు. దాదాపు రూ.3,520 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఈడీ ఆరా తీస్తోంది. పార్థసారథితో పాటు జనరల్ మేనేజర్ కృష్ణను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజులపాటు పార్థసారథిని, కార్వీ జనరల్ మేనేజర్ కృష్ణ ను విచారించనున్నారు. షెల్ కంపెనీలకు బదిలీ అయిన రూ.2,800 కోట్ల వ్యాపారానికి సంబంధించి అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం

మెడికల్ ఆఫీసర్లు కనిపించడం లేదు!

రాజ్ భవన్-ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిందా..?