వృద్ధురాలిని మోసం చేసిన వ్యక్తిపై కేసు

వృద్ధురాలిని మోసం చేసిన వ్యక్తిపై కేసు

నకిరేకల్/కట్టంగూరు, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టులు చేయిస్తానని నమ్మబలికి వృద్ధురాలి పేరిట ఉన్న భూమిని పట్టా చేయించుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై విజయ్​కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కల్మెర గ్రామానికి చెందిన బెల్లి ఎల్లమ్మ(80) జ్వరంతో బాధపడుతుండడంతో ఆమె బంధువు బెల్లి వీరయ్య(58) దవాఖానకు తీసుకువెళ్లి కరోనా టెస్టులు చేయిస్తానని చెప్పాడు. 20 రోజుల క్రితం కట్టంగూరు తహసీల్దార్​ఆఫీసుకు తీసుకువెళ్లాడు. కరోనా టెస్టు చేయించేందుకు సంతకాలు చేయాలని నమ్మించి ఆమె పేరు మీద ఉన్న 27 గుంటల భూమిని రిజిస్ట్రేషన్​చేయించుకున్నాడు. జరిగిన మోసం తెలియడంతో ఎల్లమ్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరయ్యపై పోలీసులు చీటింగ్​కేసు నమోదు చేశారు. మరోవైపు ఎస్సై తనను కొట్టాడంటూ నిందితుడు ఆరోపించాడు. నిందితుడి ఆరోపణలు అవాస్తవమని, అతడే చేతిపై గీసుకుని తాను కొట్టానని చెబుతున్నాడని ఎస్సై చెప్పారు.