హెల్త్‌‌కేర్ రంగాన్నిపట్టించుకోండి..కేంద్రాన్ని కోరిన సిప్లా

హెల్త్‌‌కేర్ రంగాన్నిపట్టించుకోండి..కేంద్రాన్ని కోరిన సిప్లా

న్యూఢిల్లీ : దేశంలో హెల్త్‌‌కేర్ రంగాన్ని ప్రమోట్ చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రముఖ డ్రగ్ కంపెనీ సిప్లా కోరింది. హెల్త్‌‌కేర్ రంగానికి నిధుల కేటాయింపు చేపట్టాలని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌ను మెరుగుపరచాలని, దేశీయ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి ఊతమిచ్చేలా పాలసీలను రూపొందించాలని సిప్లా అభ్యర్థిస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక రిపోర్ట్‌‌ను సిప్లా విడుదల చేసింది. ఈ సందర్భంగా షేర్‌‌‌‌హోల్డర్స్‌‌ను ఉద్దేశించి సిప్లా ఛైర్మన్ వైకే హమీద్ మాట్లాడారు. దేశంలో బేసిక్ హెల్త్‌‌కేర్ అన్నది ఎంతో అవసరమని పేర్కొన్నారు. దేశీయ ఫార్మా ఇండస్ట్రీకి కావాల్సిన, హెల్త్‌‌కేర్ విధానాలను ఇండియా రూపొందించాలని, ప్రజాఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులను ప్రభుత్వం పెంచాలని సూచించారు. గణనీయమైన మెజార్టీతో అధికారిక ప్రభుత్వం రెండోసారి పదవిలోకి వచ్చిందని, దీంతో అంచనాలు, ఆశలు కూడా అత్యధికంగానే ఉంటాయని సిప్లా ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ సమినా వజీరల్లి అన్నారు.

ఓ ఫార్మా కంపెనీగా, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసేందుకు, వ్యాపారాలను సులభతరం చేసేందుకు, రెగ్యులేటరీ ఫ్రేమ్‌‌వర్క్‌‌ను అభివృద్ధి పరచడానికి, హెల్త్‌‌కేర్ ఖర్చులను పెంచేందుకు, చవకైన హెల్త్‌‌కేర్ సౌకర్యాలు అందించేందుకు తాము కృషి చేయనున్నామని తెలిపారు. మరింత మంది హెల్త్‌‌కేర్ స్కీమ్‌‌లను అందించడానికి తాము ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు చూస్తున్నామని చెప్పారు. చైనాలాంటి ఎమర్జింగ్ మార్కెట్లలో వృద్ధి సాధించేందుకు డ్రగ్ కంపెనీలు చూస్తున్నాయని సిప్లా మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ సీఈవో ఉమాంగ్ వోహ్రా అన్నారు. భవిష్యత్‌‌ గ్రోత్ మార్కెట్‌‌గా చైనా ఉందని తెలిపారు. సిప్లా ఇప్పటికే  చైనాలోని పేషెంట్లకు రెస్పిరేటరీ సెగ్మెంట్‌‌లో మందులు ఇచ్చేందుకు అక్కడ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆంకాలజీ లాంటి థెరపీలకు కూడా చైనాలో ప్రొడక్ట్‌‌లను అందించేందుకు పలు మార్గాలను వెతుకుతున్నామని కంపెనీ తెలిపింది.