బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీ హవా!

బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీ హవా!
  • ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీగా నియామకాలు

ముంబై :  దేశ వ్యాప్తంగా ఐటీ రంగంలో మొత్తం ఉద్యోగావకాశాలు 3.6 శాతం క్షీణించినప్పటికీ, టెక్నాలజీ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఓపెనింగ్స్ పుంజుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 41.5 శాతం,  బెంగళూరులో 24 శాతం పెరిగాయి. ఈ నగరాలు ఐటీ నిపుణుల కోసం కేంద్రాలుగా మారుతున్నాయి.   జాబ్ క్లిక్స్​లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగార్థుల ఆసక్తి 161 శాతం, బెంగళూరులో 80 శాతం పెరిగింది. అయితే జాతీయస్థాయి ఐటీ ఉద్యోగావకాశాలు తగ్గుముఖం పట్టగా, జాబ్ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 3.6 శాతం క్షీణించాయి. 

ప్రపంచ ఆర్థిక వాతావరణం బాగా లేని కారణంగా టెక్ కంపెనీలు నియామకాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. ఎనాలసిస్​, ఎజైల్​, ఏపీఐలు, జావా, ఎస్​క్యూఎల్​ సాఫ్ట్​వేర్లకు డిమాండ్​ ఎక్కువగా ఉంది.  తొలగింపులు ఉన్నప్పటికీ, ఐటీ ఉద్యోగాల సంఖ్య పెరిగిందని ఈ రిపోర్టు తయారు చేసిన ‘ఇండీడ్​’ ఇండియా హెడ్ ఆఫ్ సేల్స్ శశి కుమార్ తెలిపారు.