ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌లో గూగుల్ పెట్టుబడులు

ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌లో గూగుల్ పెట్టుబడులు

న్యూఢిల్లీ : ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్‌‌లో 350 మిలియన్ డాలర్ల(దాదాపు 2,900కోట్ల)ను గూ గుల్‌‌ ఇన్వెస్ట్ చేసింది. ఈ టెక్ కంపెనీని మైనార్టీ ఇన్వెస్టర్‌‌‌‌గా జాయిన్ చేసుకున్నామని వాల్‌‌మార్ట్‌‌ ఆధ్వర్యంలో జరిగిన ఫండింగ్ రౌండ్‌‌లో ఫ్లిప్‌‌కార్ట్ ప్రకటించింది. సుమారు 950‌‌‌‌ మిలియన్ డాలర్లను తాజా ఫండింగ్ రౌండ్‌‌లో సేకరించిందని అంచనా.  ఫ్లిప్‌‌కార్ట్ వాల్యుయేషన్ 36 బిలియన్ డాలర్లకు పెరిగిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  

 తమ డిజిటల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను మెరుగుపరుచుకోవడంలో గూగుల్‌‌తో కుదుర్చుకున్న క్లౌడ్ కొలాబరేషన్ సాయపడుతుందని ఫ్లిప్‌‌కార్ట్‌‌ పేర్కొంది.  ఫ్లిప్‌‌కార్ట్‌‌లో 600 మిలియన్ డాలర్లను  ఇన్వెస్ట్ చేస్తామని కిందటేడాది డిసెంబర్‌‌‌‌లోనే వాల్‌‌మార్ట్ ప్రకటించింది. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో 3.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసి ఫ్లిప్‌‌కార్ట్‌‌లో తన వాటాను  పెంచుకుంది.