2.4 శాతం పెరిగిన ఐఐపీ

2.4 శాతం పెరిగిన ఐఐపీ

న్యూఢిల్లీ: మనదేశంలో ఇండస్ట్రియల్​ ప్రొడక్షన్ జులైలో 2.4 శాతం పెరిగిందని​ కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్​ఎస్​ఓ)  డేటా ప్రకారం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) 2021 జులైలో  11.5 శాతం పెరిగింది. ఈ ఏడాది జులైలో మాన్యుఫాక్చరింగ్​ ప్రొడక్షన్ 3.2 శాతం పెరిగింది. మైనింగ్ ప్రొడక్షన్ 3.3 శాతం తగ్గగా, కరెంటు ప్రొడక్షన్ 2.3 శాతం పెరిగింది.  2020 ఏప్రిల్​లో  కరోనా లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ల వల్ల ఇండస్ట్రియల్​ ప్రొడక్షన్ 57.3 శాతం తగ్గింది.

రిటైల్ ఇన్​ఫ్లేషన్ 7 శాతానికి జంప్​
రిటైల్ ఇన్​ఫ్లేషన్ (ధరల పెరుగుదల) ఈ ఏడాది ఆగస్టులో 7 శాతానికి చేరుకుంది. ఇది  జులైలో 6.71 శాతంగా రికార్డయింది. ఆహార ధరల పెరుగుదల కారణంగా ఇన్​ఫ్లేషన్​ ఇంకా ఎక్కువది.   వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఇన్​ఫ్లేషన్ వరుసగా ఎనిమిదో నెలలో ఆర్​బీఐ కంఫర్ట్ లెవెల్ 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఆహార విభాగం ఇన్​ఫ్లేషన్ ఆగస్టులో 7.62 శాతంగా ఉండగా, జూలైలో 6.69 శాతం రికార్డయింది.