కరోనా వ్యాక్సిన్ కోసం బుక్ చేసుకున్నారా..? మార్పులు తెలుసుకోండి

V6 Velugu Posted on May 16, 2021

  • కోవిషీల్డ్ వేసుకున్న వారు సెకండ్ డోస్ స్లాట్ రీషెడ్యూల్ చేసుకోవాలి
  • కో-విన్ పోర్టల్ లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం
  • కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచిన కేంద్రం
  • 84 రోజుల తర్వాత రెండో డోస్ కు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి
  • ఇప్పటికే బుక్ చేసుకున్న వారు షెడ్యూల్ మార్చుకోవాలి: కేంద్ర ఆరోగ్యశాఖ సూచన

న్యూఢిల్లీ: కోవిన్ పోర్టల్ లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చేసిన సూచనలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిషిల్డ్ రెండో డోసు వ్యవధి పెంపునకు అనుగుణంగా కో-విన్ పోర్టల్ లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసుకు ఇప్పటికే బుక్ చేసిన షెడ్యూల్ ను లబ్ధిదారులు మార్పులు చేసుకోవాలని సూచించింది. 84 రోజుల తర్వాత కోవిషిల్డ్ రెండో డోసు కోసం అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.కోవిషిల్డ్ రెండు డోసుల మధ్య పెంచిన వ్యవధిని రాష్ట్రాలు కూడా గుర్తించాలని కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ లో జరిగిన మార్పులపై రాష్ట్రాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. 

Tagged COVID Vaccination, corona vaccination, , vaccination guidelines , covin portal, arogyasethu app, vaccine second dose, vaccine booking

Latest Videos

Subscribe Now

More News