
న్యూఢిల్లీ : డొమెస్టిక్ క్రూడాయిల్ ప్రొడక్షన్‌పై విండ్ఫాల్ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం 'నిల్' చేసింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్)లపై అంతకుముందున్న జీరో డ్యూటీనే కొనసాగించాలని నిర్ణయించింది. ఓఎన్జీసీ వంటి కంపెనీలు దేశంలో ఉత్పత్తి చేసే క్రూడ్‌పై స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని నిల్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా ఈ ఎస్ఏఈడీ టన్నుకు రూ. 4,100 గా ఉండేది. మంగళవారం నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. జులై 2022 లో విండ్‌ఫాల్ ట్యాక్స్ అమలులోకి తెచ్చిన తర్వాత డొమెస్టిక్ క్రూడ్‌పై దానిని నిల్ లెవెల్‌కి తేవడం ఇది రెండోసారి.
ఈ ఏడాది ఏప్రిల్ మొదట్లో ఒకసారి నిల్ లెవెల్‌కు తెచ్చినా, అదే నెలలో 15 రోజుల తర్వాత మళ్లీ టన్నుకు రూ. 6,400 చొప్పున విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించారు. డీజిల్ ఎక్స్‌పోర్ట్‌పై డ్యూటీని ఏప్రిల్4 న జీరో లెవెల్‌కు తెచ్చారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. గ్లోబల్‌గా క్రూడ్ రేట్లు బ్యారెల్ ఒకటికి 80 డాలర్ల నుంచి ఇటీవల 75 డాలర్లకు తగ్గడంతో డొమెస్టిక్ క్రూడ్ ప్రొడక్షన్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ప్రతీ 15 రోజులకి ఒకసారి విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రివ్యూ చేస్తున్న విషయం తెలిసిందే.