అధికారులను కాంటాక్ట్ చేసేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్స్

అధికారులను కాంటాక్ట్ చేసేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్స్

ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది కేంద్ర సర్కార్. ఉక్రెయిన్ బోర్డర్స్ కు  చేరుకుంటున్న వారికి సాయం చేసేందుకు ఎంబసీ ప్రత్యేక అధికారులను నియమించింది. రొమేనియాకు నలుగురు అధికారులను అపాయింట్ చేసింది. స్లోవాక్ రిపబ్లిక్ కు ఇద్దరు, హంగేరికి ఒకరిని నియమించింది. బోర్డర్స్ లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే...అధికారులను కాంటాక్ట్ చేయాలని ప్రత్యేక ఫోన్ నెంబర్స్ ఇచ్చింది. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న పోలాండ్, హంగేరి, రోమానియా, స్లోవాక్ రిపబ్లిక్ బోర్డర్లకు రావాలని... ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. అయితే భయంతో చాలా మంది ఇండియన్స్ తమకు తోచిన దారుల్లో బోర్డర్స్ కు చేరుకున్నారు.  కరెక్ట్ పాయింట్ తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి అక్కడే ఉన్నామంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. తినేందుకు కూడా ఏం లేవని... ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ టైంలో కేంద్రం నాలుగు దేశాల బోర్డర్స్ కు సంబంధించి 10 మంది ప్రత్యేక అధికారులను నియమించింది. ఫోన్ నెంబర్స్ రిలీజ్ చేసింది. వీరికి కాంటాక్ట్ కావాలని సూచించింది. 

మరిన్ని వార్తల కోసం

 

ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం

రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ