కుట్రతోనే చెక్ పవర్ తీసేశారు..ఉప సర్పంచ్ ఆవేదన

కుట్రతోనే చెక్ పవర్  తీసేశారు..ఉప సర్పంచ్ ఆవేదన

యాదాద్రి భువనగిజిల్లా: కుట్ర పూరితంగా తన చెక్ పవర్ ను రద్దు చేశారని వలిగొండ మండలం అరూరు గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు ఆరోపించారు.  గ్రామపంచాయతీలో  తమకు అనుకూలమైన వారిని పిలిపించుకొని బహిరంగ గ్రామ సభగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చెయ్యని పనులు కూడా ఎం బి చేసుకున్నందుకు నిరసనగా  చెక్కులపై సంతకాలు పెట్టలేదని సుక్క ముత్యాలు తెలిపారు. 


వలిగొండ మండలం అరురూ గ్రామ పంచాయితీలో నిధుల దుర్వినియోగంను అడ్డుకున్నందుకే, కుట్ర పూరితంగా తన చెక్ పవర్ ని తీసివేశారని ఆరోపించారు. తమ గ్రామంలో ఇంకా దొరల పాలన కొనసాగుతుందన్నారు. పోలీసులు కూడా సర్పంచ్ కే అనుకూలంగా వ్యవహరించానన్నారు. చదువుకున్న వ్యక్తిగా ఊరి అభివృద్ధికి  కేటాయించాల్సిన నిధులను దుర్వినియోగం అవుతుంటే, జిల్లా కలెక్టర్, డిపివోకి వినతి పత్రాలు అందజేశానని చెప్పారు. అయితే  నిధుల దుర్వినియోగంపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయితీ నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే 14 సార్లు అధికారులకు వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సంబంధించి నాలుగు లక్షల రూపాయలు, వీధిదీపాల సంబంధించి రూ. 18 లక్షలు  గ్రామ వార్డు సభ్యుల అంగీకారం లేకుండానే ఎంబి చేశారని ఆరోపించారు. సీసీ రోడ్లకు సంబంధించి  ఎన్ని నిధులు వచ్చాయనే విషయాన్ని సర్పంచ్ కానీ.. కార్యదర్శి కానీ తనకు చెప్పలేదన్నారు. 200 మందిని గ్రామపంచాయితీకి పిలిచి, అందులో ఎక్కువగా ఉపాధి హామీ కూలీలను తీసుకువచ్చి  బహిరంగ గ్రామ సభగా చిత్రీకరించారని.. వారితోనే తమకు అనుకూలంగా చేతులు పైకి ఎత్తించి, తన చెక్ పవర్ ను రద్దు చేయించారని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి గ్రామంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తా అన్నారు ఉపసర్పంచ్ సుక్క ముత్యాలు.