వాగులో జారిపడిన చిన్నారి

వాగులో జారిపడిన చిన్నారి

గుండాల వెలుగు: వానకాలం వచ్చిందంటే ఎప్పుడు ఏ వాగు పొంగుతుందో.. ఏ కుంట తెగుతుందో నని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగుండాల మండలంలోని గిరిజన గ్రామాల ప్రజలు భయం భయంగా గడుపుతుంటారు. నాలుగు రోజులుగా భారీవర్షాల వల్ల మల్లన్న వాగు పొంగిపొర్లుతోంది. పైపుల మీద మట్టి నింపి వేసిన వంతెన కొట్టుకు పోయింది. దాంతో ప్రమాదం అని తెలిసినా
దేవళ్ల‌గూడం, రోళ్ల‌గడ్డ‌, కన్నాయిగూడెం, నర్సపురం, రోళ్ల‌గడ్డ తండా ప్రజలు గురువారం వాగు దాటి మండల కేంద్రానికి వెళ్లారు. వాగుదాటుతుండగా యపాల గడ్డ గ్రామానికి చెందిన మహిళ చేతిలో ఉన్న పాప ప్రమాదవశాత్తు జారి పడింది. పైపులో ఇరుక్కున్న చిన్నారి వరద ఉధృతి పెరగడంతో రెండోవైపు నుంచి బయటకు వచ్చింది. గాయపడిన పాపను ప్రభుత్వ ఆస్పత్రికి
తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి