400 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

400 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

హైదరాబాద్ నుంచి కర్ణాటకకు రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ శివారులో పరివార్ దాబా సమీపంలో హైదరాబాద్ నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. దాదాపు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు‌  హైదరాబాద్ లోని పాతబస్తీ  కీసర సమీపంలోని బోగారం కేంద్రంగా రేషన్ బియ్యాన్ని కర్ణాటక సరిహద్దులకు కంత్రీగాళ్లు తరలిస్తు్న్నారని తెలిపారు. 

గుట్టుచప్పుడు కాకుండా రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుుకున్నారు. లారీ డ్రైవర్  మహబూబ్ ,యజమాని  నసీర్ అహ్మద్ లపై కేసు నమోదు చేశారు.  మరో లారీ డ్రైవర్ ఇస్మాయిల్ పరారీ లో ఉన్నారు. వీరందరిపై  క్రిమినల్  కేసులు నమోదు చేస్తున్నట్టు సివిల్ సప్లై అధికారి సురేష్ కుమార్ తెలిపారు.