
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. భేటీకి ముందు కాంగ్రెస్ నేతలు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సోనియా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తడంలో ముందుండాలని ఎంపీలకు ఉద్బోధించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసందరముందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో వంటగ్యాస్, నిత్యావసర సరుకులు, పెట్రో ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. వ్యవసాయ చట్టాల పేరుతో వందల మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టకుందని ఆరోపించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు.
Congress Parliamentary Party (CPP) chairperson Sonia Gandhi chaired a meeting of the group at 10 Janpath today. pic.twitter.com/6yStZgmekt
— ANI (@ANI) April 5, 2022
మరిన్ని వార్తల కోసం:
అమిత్ షా, చిదంబరం పలకరించుకున్రు
మాట నిలబెట్టుకున్న రాజమౌళి