వచ్చే వారం ఠాక్రేకు స్ట్రాటజీ రిపోర్ట్​!

వచ్చే వారం ఠాక్రేకు స్ట్రాటజీ రిపోర్ట్​!

హైదరాబాద్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో గెలవడానికి  దీటైన వ్యూహాలను అమలు చేయాలని కాంగ్రెస్​ స్ట్రాటజీ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్​లోని చిరాన్​ ఫోర్ట్​ క్లబ్​ హోటల్​లో స్ట్రాటజీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఆ నివేదికను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రేకు సమర్పించనున్నారు. 

వచ్చే వారం ఆయనతో సమావేశమై స్ట్రాటజీలో మార్పులు చేర్పులపై చర్చించాలని భావిస్తున్నారు. అనంతరం మరోసారి స్ట్రాటజీ కమిటీ భేటీని నిర్వహించి తుది నివేదికను రెడీ చేయనున్నారు. పొత్తులతో గతంలో బాగా దెబ్బతిన్నామని సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఈసారి పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.