ఆట మొదలైంది

ఆట మొదలైంది

బీజింగ్‌‌: కరోనా ముప్పు, పలు దేశాల బాయ్‌‌కాట్‌‌, లాక్‌‌డౌన్స్‌‌ మధ్యనే ప్రతిష్టాత్మక వింటర్‌‌ ఒలింపిక్స్‌‌ బీజింగ్‌‌లో శుక్రవారం షురూ అయ్యాయి.  ఓపెనింగ్‌‌ సెర్మనీకి హాజరైన  చైనా ప్రెసిడెంట్‌‌ జిన్‌‌పింగ్‌‌ గేమ్స్‌‌ స్టార్ట్‌‌ అయినట్టు ప్రకటించారు.  ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ మెగా గేమ్స్‌‌లో 91 దేశాల నుంచి 2800పైగా అథ్లెట్లు బరిలో నిలిచారు. ఇండియా నుంచి 31 ఏళ్ల ఆరిఫ్‌‌  ఒక్కడే బరిలో నిలిచాడు. ఓపెనింగ్‌‌ సెర్మనీ మార్చ్‌‌ఫాస్ట్‌‌లో తను ఇండియా ఫ్లాగ్‌‌బేరర్‌‌గా వ్యవహరించాడు. ఆరిఫ్‌‌ స్కీయింగ్‌‌లో పోటీ పడుతున్నారు. స్లాలోమ్‌‌, జెయింట్‌‌ స్లాలోమ్‌‌ ఈవెంట్లకు తను క్వాలిఫై అయ్యాడు. ఓపెనింగ్‌‌ సెర్మనీకి రష్యా ప్రెసిడెంట్‌‌ పుతిన్‌‌ అటెండ్‌‌ అయ్యారు.