సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న క‌రోనా టైంపాస్ ఛాలెంజ్

సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న క‌రోనా టైంపాస్ ఛాలెంజ్

క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ ఉండ‌టంతో .. ఇంట్లోనే ఉంటున్న‌వారు టైంపాస్ కు సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్ లో ర‌క‌ర‌కాల ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. మ‌హిళ‌లు సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిగా చీర‌లో ఉన్న ఫొటో త‌మ వాట్సాప్ స్టేట‌స్ లేదా ఫేస్ బుక్ లో పెట్టుకోవాలంటూ ఛాలెంజ్ విసురుతున్నారు.

వెంట‌నే ఛాలెంజ్ ను అంగీక‌రిస్తూ వారి పేరును తెలుపుతూ .. ట్రెడిష‌న‌ల్ ఫొటోను స్టేట‌స్ గా పెట్టుకుంటున్నారు. అలాగే వారికి న‌చ్చిన కొంత‌ మందికి ఈ ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఇలా మారుమూల గ్రామాల నుంచి మ‌న దేశంలోనే కాక‌.. విదేశాల్లో ఉన్న భార‌త మ‌హిళ‌లు కూడా ఈ ఛాలెంజ్ ను అంగీక‌రిస్తున్నారు. మొత్తానికి ఈ రూపంలోనైనా స్త్రీలోని ఔన్న‌త్వాన్ని తెలిపే ఈ ఛాలెంజ్ బాగుందంటున్నారు నెటిజ‌న్లు.

పురుఫులు విష‌యానికొస్తే.. కొంద‌రూ సాహీతీ వేత్త‌లైతే క‌రోనాపై పాట‌లు రాస్తూ పాడుతున్నారు. మ‌రికొంత‌మంది యువ‌త‌.. వాట్సాప్ లో హాయ్ అని చెబితే.. ఆ వ్య‌క్తిపై త‌న‌కున్న అభిప్రాయాన్ని తెలియ‌జేస్తూ స్టేట‌స్ లో హాయ్ చెప్పిన అత‌డి ఫొటో పెడుతున్నారు. ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎవ్వ‌రికి న‌చ్చిన వారు ర‌క‌ర‌కాల ఛాలెంజ్ ల‌తో క‌రోనా టైంపాస్ అంటూ క్యాప్ష‌న్స్ పెడుతున్నారు. మొత్తానికి సోష‌ల్ మీడియా వేదిక‌గా లాక్ డౌన్ కార‌ణంగా ఇలా క‌ర‌క‌ర‌కాల ఛాలెంజ్ ల‌తో టైంపాస్ చేస్తున్నారు కొంత‌మంది ప్ర‌జ‌లు.