అలర్ట్.. చలి కాలంలో వైరస్ ఎక్కువ స్ప్రెడ్

అలర్ట్.. చలి కాలంలో వైరస్ ఎక్కువ స్ప్రెడ్

ఫెస్టివల్స్ , షాపింగ్ ల వల్ల వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే చాన్స్ ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు. కోఠిలో వరదలు, కరోనాపై డీఎంఈ రమేష్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో కరోనా, వరదలు రెండు సమస్యలున్నాయన్నారు. జీహెచ్ఎంసీ చుట్టూ పక్కల ప్రాంతాలు చాలా సఫర్ అవుతున్నాయన్నారు. పండగల సీజన్ కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

డిసెంబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. లక్షణాలు లేనివాళ్ళ వల్ల స్ప్రెడ్ ఎక్కువగా ఉందన్నారు. కేరళ, ఢిల్లీలో కరోనా కేసులు తగ్గి మళ్ళీ కేసులు పెరిగాయయన్నారు. కేరళలో జరిగిన ఓనమ్ పెస్టివల్ వల్ల కేసుల వల్ల 10 వేల కేసులు పెరిగాయన్నారు. చలి కాలం అన్ని వైరస్ లకు అనువైన కాలం అని బాగా స్ప్రెడ్ అవుతుందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు.. వచ్చినా ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుందో తెలియదన్నారు.

ఏడెనిమిది నెలలుగా  రాష్ట్రంలో కరోనా 0.57 శాతం డెత్ రేట్ , సుమారు 90 శాతం రికవరీ రేట్ , 22 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. అందులో 4 వేల మంది హాస్పిటల్స్ లో ఉన్నారన్నారు. 38 లక్షల పైగా టెస్ట్ లు చేశామన్నారు. గాంధీలో 350 మంది పేషన్స్ ఉన్నారన్నారు. వరద ప్రాంతాలలో ఉన్నవారిని షెల్టర్స్ కు పంపిస్తున్నారన్నారు. అందులో ఉన్నవారికి కరోనా టెస్ట్ లు చేస్తున్నామన్నారు. కలరా , టైఫాయిడ్, జండిస్ వంటి రోగాలు ఎక్కువగా వస్తాయన్నారు. నీటిని కాచి తాగాలని.. వేడి ఫుడ్ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 104 నెంబర్ కు కాల్ చెయ్యాలన్నారు.

నాల కబ్జా.. కార్పోరేటర్ కాలర్ పట్టుకుని కొట్టిన స్థానికులు