దేశం టాయ్స్ హబ్‌ కావాలి: మోడీ

దేశం టాయ్స్ హబ్‌ కావాలి: మోడీ

మన్‌ కీ బాత్‌ లో స్టార్టప్స్, ఎంట్రప్రెన్యూవర్స్‌‌కు మోడీ పిలుపు

ఆట బొమ్మలు మన దేశంలోనే తయారు చేద్దాం

ప్రపంచ మార్కెట్ లో వాటా పెంచుకుందాం

మన చరిత్ర, సంప్రదాయాల ఆధారంగా గేమ్స్ తయారు చేయండి

రూ.7 లక్షల కోట్లకు పైగా ఉన్న ప్రపంచ బొమ్మల మార్కెట్ లో మన వాటా చాలా తక్కువగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి.. మన దగ్గర వారసత్వం, సంప్రదాయం, వైవిధ్యం, యువ జనాభా ఉన్నా కూడా బొమ్మల మార్కెట్లో ఇంత తక్కువ వాటా కలిగి ఉండటం సరైనదేనా?.. టాయ్స్ తయారీ కోసం స్టార్టప్స్, ఎంట్రప్రెన్యూవర్స్ టైఅప్ కావాలి. బొమ్మల పరిశ్రమకే హబ్ గా మరే ప్రతిభ, సామర్థ్యం దేశానికి ఉంది ’’ – ప్రధాని నరేంద్ర మోడీ

లోకల్‌‌ బ్రీడ్‌ డాగ్స్‌‌ పెంచుకోండి

ఇండియా సెక్యూరిటీ ఆపరేషన్స్‌‌లో డాగ్స్‌‌ పాత్రను ప్రధాని మోడీ మెచ్చుకున్నరు. ఇటీవల జరిగిన 74వ ఇండిపెండెన్స్‌‌ డే సెలబ్రేషన్స్‌‌లో చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ‘కమెండేషన్‌‌ కార్డ్స్‌‌’ అవార్డు అందుకున్న విదా, సోఫీ అనే డాగ్స్‌‌ గురించి ప్రస్తావించారు. ఇటీవల మరణించిన రాకీ అనే డాగ్‌‌ను గుర్తు చేసుకున్న మోడీ.. దాని సేవలను పొగిడారు. పెట్‌ డాగ్స్‌‌ను పెంచుకోవాలని అనుకునే ఇండియన్స్‌‌ లోకల్‌‌ బ్రీడ్స్‌‌ను తెచ్చుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

న్యూఢిల్లీ: ‘‘రూ.7 లక్షల కోట్లకు పైగా ఉన్న ప్రపంచ బొమ్మల మార్కెట్ లో మన వాటా చాలా తక్కువగా ఉంది. టాయ్స్ తయారీ కోసం స్టా ర్టప్స్,  ఎంట్రప్రెన్యూవర్స్ టైఅప్ కావాలి. బొమ్మల పరిశ్రమకే హబ్ గా మారే ప్రతిభ, కెపాసిటీ దేశానికి ఉంది’’ అని ప్రధాని నరేం ద్ర మోడీ చెప్పారు. ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్‌‌లను వాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు.

ఇంత పెద్ద మార్కెట్ లో మన వాటా ఇంతేనా?

ప్రతి రంగంలో స్వయం స్వావలంబన సాధించాలని, బొమ్మలు, గేమింగ్ రంగంలో కూడా ఇందుకు మంచి అవకాశాలు ఉన్నాయని మోడీ చెప్పారు. ‘‘ప్రపంచ టాయ్స్ మార్కెట్ పరిశ్రమ రూ.7 లక్షల కోట్లకు పైగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా పెద్ద వ్యాపారం. కానీ ఇందులో మన వాటా చాలా తక్కువ. ఒక్కసారి ఆలోచిం చండి.. మన దగ్గర వారసత్వం, సంప్రదాయం, వైవిధ్యం, యువ జనాభా ఉన్నా కూడా బొమ్మల మార్కెట్లో ఇంత తక్కువ వాటా కలిగి ఉండటం సరైనదేనా?’’ అని ప్రశ్నించారు.

మన ఆటలు కావాలి..

‘వోకల్ ఫర్ లోకల్ టాయ్స్’ కోసం స్టార్టప్స్ పని చేయాల్సిన టైం వచ్చిందని మోడీ అన్నారు. కంప్యూటర్ గేమ్స్ ఇండియా బేస్డ్ గా ఉండేలా తయారు చేయాలన్నారు. దేశంలోని గొప్ప వారసత్వం , సంప్రదాయాల ద్వారా బొమ్మలు, గేమింగ్ ఇండస్ట్రీలో ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చన్నారు. ఇండియన్ కాన్సెప్టులు, హిస్టరీ ఆధారంగా కంప్యూటర్ గేమ్స్ తయారు చేయాలని ఎంట్రప్రెన్యూవర్స్ కు పిలుపునిచ్చారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఆడే గేమ్స్‌‌ రూపొందించాలన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆటల్లో వెస్ట్రన్ ప్రభావం ఎక్కువ ఉందని మోడీ చెప్పారు. మన సంస్కృతికి అనుగుణంగా ఆటల్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్థానిక కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

కరోనా సమయంలోనూ పంట సాగు పెరిగింది ..

ఓవైపు కరోనా విజృంభిస్తున్నా.. రైతులు మాత్రం కష్టపడి పంటలు పండిస్తున్నారని ప్రధాని మోడీ కొనియాడారు. ఈ ఖరీఫ్‌ లో గతేడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని తెలిపారు. ‘‘గతేడాదితో పోలిస్తే ఖరీఫ్ పంట సాగు 7 శాతం పెరిగింది. వరి 10 శాతం, పప్పు దినుసులు 5 శాతం, నూనె గింజలు 13 శాతం, పత్తి సాగు 3 శాతం పెరిగింది’’ అని వివరించారు.

జాగ్రత్తలతో వేడుకలు

ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ పండుగలను సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు. ఎన్విరాన్ మెంట్ ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాలను చాలా చోట్ల ఏర్పాటు చేశారని, గణేశ్ ఉత్సవాలను ప్రజలు క్రమశిక్షణతో జరుపుకుంటున్నారని ప్రశంసించారు. కుక్కను పెంచుకోవాలనుకునే వారు ఇండియన్ బ్రీడ్ కుక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ నెలను న్యూట్రిషన్ మంత్​గా పాటించాలని పిలుపునిచ్చారు. మంచి పోషకాహారం పొందాల్సిన అవసరాన్ని సామూహిక ఉద్యమంగా మారుస్తున్నామని చెప్పారు. 2022లో ఇండియా 75వ ఇండిపెండెన్స్ డే వేడుకలను జరుపుకోనున్న నేపథ్యంలో స్టూడెంట్లకు స్థానికంగా జరిగిన స్వతంత్ర పోరాట సంఘటనలు, ఫ్రీడం ఫైటర్ల గురించి టీచర్లు వివరించాలని సూచించారు.