
నిర్మల్: కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ వైపు ఉన్న మైసమ్మ ఆలయం వద్ద గండి కొట్టడంతో వరద నీరు గండి గుండా కిందికి పోతోంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు వాటర్ ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండి.. అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులు ఆందోళన పడ్డారు. కానీ గండి కొట్టడంతో హరిత రిసార్ట్ సమీపంలో వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగ.. ప్రస్తుతం 698 అడుగుల వరకు వరద నీరు వచ్చి చేరింది. ఇన్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు కాగ... ఔట్ ఫ్లో మూడున్నర లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం మొత్తం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు. ఇంకో గేటు తెరుచుకోలేదు. ఇప్పటికే ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ సేఫ్ జోన్ లో ఉందంటున్న అధికారులు...కాసేపట్లో వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.