సిటీలో సొంత ఇల్లు మీ డ్రీమా.. బంపర్ ఆఫర్.. రూ.11.5 లక్షలకే 3BHK ఫ్లాట్..!

సిటీలో సొంత ఇల్లు మీ డ్రీమా.. బంపర్ ఆఫర్.. రూ.11.5 లక్షలకే  3BHK ఫ్లాట్..!

న్యూఢిల్లీ: మెట్రో సిటీలో సొంతింటి కల నిజం కావడం ఆషామాషీ విషయం కాదు. లక్షల్లో జీతాలు, కోట్లలో సంపాదన ఉన్నవాళ్లే మెట్రో సిటీల్లో లగ్జరీ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటుంటారు. కానీ.. దేశ రాజధాని ఢిల్లీలో 40 వేల డిస్కౌంటెడ్ ఫ్లాట్స్ అమ్మకానికి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ తెరలేపింది. రూ.11.5 లక్షల ప్రైజ్ రేంజ్ నుంచి ఈ ఫ్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో 3 BHK ఫ్లాట్స్ కూడా కొన్ని ఉన్నట్లు తెలిసింది.

 

ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ తాజాగా మూడు సరికొత్త హౌసింగ్ స్కీమ్స్ను నగరవాసుల కోసం అందుబాటులోకి తెచ్చింది. డీడీఏ సత్స ఘర్ హౌసింగ్ స్కీ్ం 2024, డీడీఏ జనరల్ హౌసింగ్ స్కీం 2024, డీడీఏ ద్వారకా హౌసింగ్ స్కీం 2024 పేరుతో మూడు స్కీమ్స్ను డీడీఏ తాజాగా తీసుకొచ్చింది. ఈ స్కీంలో భాగంగా దగ్గరదగ్గర 40 వేల ఫ్లాట్స్ అమ్మకానికి ఉంచబోతున్నారు. 

ఢిల్లీలోని జసోలా ప్రాంతంలో ఈ ఫ్లాట్స్ ఉన్నాయి. అపోలో హాస్పిటల్కు, జసోలా అపోలో మెట్రో స్టేషన్కు, టాప్ స్కూల్స్కు ఈ ఫ్లాట్స్ దగ్గరగా ఉన్నాయి. ఆగస్ట్ 19 నుంచి ఈ హౌసింగ్ స్కీమ్స్ మొదలయ్యాయి. ఆగస్ట్ 21న ఈ ఆక్షన్ విధానంలో రిజిస్ట్రేషన్ మొదలుకానుంది. సెప్టెంబర్ 10న ఈ స్కీమ్స్ కింద ఫ్లాట్స్ బుక్ చేయనున్నారు. మార్చి 31, 2025తో ఈ స్కీం ముగియనుంది. రాంఘర్ కాలనీ, సిరస్పూర్, లోక్ నాయక్ పురం, రోహిణి, నరేలా ప్రాంతాల్లో 11.5 లక్షల నుంచి ఈ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం ఫ్లాట్స్ ధర రూ.1.2 కోట్ల వరకూ ఉంది. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఈ కాస్టీ ఫ్లాట్స్ ఉన్నాయి.