హైటెన్షన్ వైరు తాకి 80 ఏళ్ల వృద్ధురాలు సజీవ దహనం : యూపీలో కలకలం

హైటెన్షన్ వైరు తాకి 80 ఏళ్ల వృద్ధురాలు సజీవ దహనం : యూపీలో కలకలం

ఉత్తరప్రదేశ్ లో 80 ఏళ్ల వృద్ధురాలు హైటెన్షన్ వైరు తాకి చనిపోవడం స్థానికంగా సంచలనం రేపింది. విద్యుత్ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ.. మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

అసలేం జరిగింది..? 

యూపీలోని మిర్జాపూర్‌లో శనివారం (జులై 29వ తేదీ) మధ్యాహ్నం సమయంలో 80 ఏళ్ల వృద్ధురాలు తమ ఇంటిలోని బాల్కనీలో నిల్చుని.. తమ మనవడిని పిలుస్తోంది. ఇదే సమయంలో ఇంటిపైన ఉన్న హైటెన్షన్ వైర్లు తాకడంతో ఒక్కసారిగా ఆమెకు కరెంటు షాక్ తగిలింది. వెంటనే మంటలు చెలరేగి.. స్పాట్ లోనే సజీవ దహనమైంది. అందరూ చూస్తుండగా కరెంట్ షాక్ తో తుదిశ్వాస విడిచింది. 

ప్రమాదం సమయంలో వృద్ధురాలి అరుపులు విన్న  కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ.. అప్పటికే ఆమె చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

వృద్ధురాలి డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్న రబుపురా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ ఇండ్లపై ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించాలని గతంలో చాలాసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు మృతురాలి బంధువులు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. మహిళ మృతికి కారకులైన వారిపై హత్యానేరం మోపాలని డిమాండ్ చేశారు. 

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రబుపురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చెప్పారు. పోస్టుమార్టం కోసం వృద్ధురాలి డెడ్ బాడీని మార్చురీకి తరలించామన్నారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ తర్వాత బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు.

https://twitter.com/lavelybakshi/status/1685271087071047680