
హైదరాబాద్: అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ 1992లో ఐఎస్ఐ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జి. కృష్ణ ప్రసాద్ భార్య జానకమ్మ ఈ నెల 4 న కరోనాతో చనిపోయారు. ఇంతలోనే ఈ నెల 19 న రాత్రి ఆయన కూతురు గ్రూప్ వన్ ఆఫీసర్ దీప్తి మృతి చెందడం కలచివేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. కృష్ణ ప్రసాద్ కొడుకు వివేక్ తో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.