ప్రాజెక్టుల అప్పులు లక్ష కోట్లకు పైనే

ప్రాజెక్టుల అప్పులు లక్ష కోట్లకు పైనే
  • ఇంకో రూ.50 వేల కోట్ల కు పైగా తెచ్చే యోచనలో సర్కారు
  • ఇప్పటికే నేరుగా తీసుకొచ్చిన 3 లక్షల కోట్లకు ఇవి అదనం
  • తొలి ఏడాది కిస్తీలకు రూ.2 వేల కోట్లకు పైగా బడ్జెట్

ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం సర్కారు తెచ్చిన అప్పు రూ.లక్ష కోట్లను దాటింది. కాళేశ్వరం లాంటి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మొదలుకొని చెక్ డ్యాంల నిర్మాణం వరకు అన్నింటికీ ప్రభుత్వం లోన్ల పైనే ఆధార పడుతోంది. ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యే సరికి అప్పుల భారం మరో రూ.50 వేల కోట్లకు పైనే పెరగనుంది. దీంతో ఒక్క ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కోసమే కేసీఆర్ రూ.లక్షన్నర కోట్లఅప్పు చేసినట్టు అవుతుంది. ఈ అప్పులన్నీసర్కారు గ్యారెంటీతో రెండు కార్పొరేషన్లు సమకూర్చున్నవే.

ఖర్చే కాదు.. అప్పుల్లోనూ టాప్

నిర్మాణ వ్యయంలోనే కాదు అప్పుల్లోనూ కాళే శ్వరం ప్రాజెక్టుదే పైచేయిగా ఉంది. కాళేశ్వరం కట్టేందుకు ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్’ పేరుతో 2016లో కొత్త సంస్థను సర్కారు ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం దీనికి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల కొరత సమస్యను తీర్చడానికి దాన్ని 2019లో కాళేశ్వరం కార్పొరేషన్ లో ఇంక్లూడ్ చేశారు. మొత్తంగా కాళేశ్వరం కార్పొ రేషన్ రూ.95 వేల కోట్ల అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. ఇందులో రూ.80 వేల కోట్ల అప్పు కోసం బ్యాంకులు, పలు ఆర్థికర్థి సంస్థ లతో కాళేశ్వరం కార్పొరేషన్ ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఒక్క కాళేశ్వరం ప్రా జెక్టు కోసం చేసిన అప్పు రూ.70 వేల కోట్లుకాగా, పాలమూరు కోసం రూ.10 వేల కోట్ల లోన్ తీసు కున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.51 వేల కోట్లను దాటడంతో ఇంకో రూ.20 వేల కోట్లకు పైగా లోన్ తేవాలనే యోచనలో సర్కారు ఉంది.

ఇరిగేషన్ అప్పు రూ.20వేల కోట్ల పైనే

ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఇరిగేషన్ ఇన్ ఫ్రాస్ట్ర క్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో ఇంకో కార్పొరేషన్ ఉంది. అడ్మిన్ ఈఎన్సీ నాగేందర్ రావు దీనికి ఎండీగా వ్యవహరిస్తున్నారు. దేవాదుల, సీతారామ లిఫ్ట్స్కీంలు, కంతనపల్లి బ్యారేజీ, ఎస్సారెస్పీ వరద కాలువకు ఈ సంస్థ ద్వారా నిధులు సమకూర్చుతున్నారు. ఈ కా ర్పొరేషన్ సంబంధిత ప్రాజెక్టుల కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. కొత్తగా సీతారామ లిఫ్ట్స్కీంకు, కంతనపల్లి బ్యా రేజీకి లోన్ తీసుకునే మొత్తాన్ని 75 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఈ రెండు ప్రాజెక్టుల పేరుతో ఇంకో రూ.5 వేల కోట్ల వరకు అప్పు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దుమ్ముగూడెం బ్యారేజీ (సీతమ్మ సాగర్)ను సీతారామ లిఫ్ట్లో భాగంగానే పేర్కొంటూ దానికి లోన్ తీసుకురానున్నారు. ఇవన్నీకలిపితే రూ.10 వేల కోట్లకు పైగా అప్పు తప్పదని సమాచారం.

 చెక్ డ్యాంలకూ అప్పులే

రాష్ర్టంలో మొత్తం 1,200 చెక్ డ్యాంలకు రూ.4,500 కోట్ల వరకు ఖర్చవుతుండగా అందులో 90 శాతం నాబార్డు నుంచి లోన్ తేవడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తోంది. 2020–21లో రూ.2 వేల కోట్ల లోన్ తీసుకునేం దుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇవ్వగా.. అగ్రి మెంట్ ప్రాసెస్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.

రూ.3 లక్షల కోట్ల కు అదనం

రాష్ట్రం నేరుగా తీసుకున్న రూ.3 లక్షల కోట్ల అప్పుకు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం తెచ్చే లోన్లు అదనం. ప్రభుత్వం గ్యారెంటీతో కాళేశ్వరం, ఇరిగేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లు.. బ్యాంకు లు, ఆర్థికర్థి సంస్థల నుంచి లోన్లు తీసుకుంటున్నాయి. కాళేశ్వరం కార్పొరేషన్ కోసం తెచ్చిన అప్పుల రీ పేమెంట్ ఈ ఆర్థికర్థి సంవత్సరం నుంచే మొదలైంది. కిస్తీలకు రూ.2 వేల కోట్లకు పైగా బడ్ట్ జె కేటాయించింది. భవిష్యత్తులో ఈ మొత్తం పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు.