మెదక్ కలెక్టరేట్ లో దశాబ్ది ఉత్సవాల సమావేశం రసాభాస

మెదక్ కలెక్టరేట్ లో దశాబ్ది ఉత్సవాల సమావేశం రసాభాస

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని.. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల సమావేశం రసాభసగా మారింది. మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గొడవకు దిగారు. మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గ్రామాల్లో నిధులు లేక అభివృద్ధి జరగడం లేదని, వేడుకల పేర్లతో డబ్బులను ఖర్చు పెడుతున్నారంటూ బీజేపీ నాయకులు నిలదీశారు.

దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఆందోళన చేయడంతో పోలీసులు వారిని బయటకు పంపించారు. దీంతో వారు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.