శంషాబాద్ లో ఆకట్టుకుంటున్న బతుకమ్మ అలంకరణ

శంషాబాద్ లో ఆకట్టుకుంటున్న బతుకమ్మ అలంకరణ

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో వెల్కమ్ చెబుతున్నట్లుగా  బతుకమ్మ ఆకారంలో ఏర్పాటు చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కళ్ళకు కట్టే విధంగా పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా తయారు చేశారు. దీంతో దేశ, విదేశాల నుంచి రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తోన్న ప్రయాణికులు అక్కడి బతుకమ్మను చూసి పరవశించిపోతున్నారు. ఈ సందర్భంగా శంశాబాద్ విమానాశ్రయ సిబ్బందిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.  తొమ్మిది రోజుల తర్వాత ఆ బతుకమ్మలను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.