రేపు ఢిల్లీకి రాష్ట్ర మంత్రుల బృందం

రేపు ఢిల్లీకి రాష్ట్ర మంత్రుల బృందం

టీఆర్ఎస్  విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. భేటీకి ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు,డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు,  రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి పార్టీ లీడర్లతో సమావేశమై మాట్లాడారు కేసీఆర్.

సమావేశంలో ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు సీఎం కేసీఆర్ . నియోజకవర్గాల వారీగా ఏం జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం క్రాస్ ఓటింగ్ పై సీరియస్ అయ్యారు గులాబీ బాస్. క్రాస్ ఓటింగ్ చేసింది.. చేయించింది ఎవరో తేలాలన్నారు. సీఎం కేసీఆర్ ను కలిపించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలను తెలంగాణ భవన్ కు తీసుకువచ్చారు మంత్రి పువ్వాడ అజయ్. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఫిర్యాధు చేశారు అంజయ్. ఇక రైతుబంధు యదావిధిగా కొనసాగిస్తామని సమావేశంలో స్పష్టంచేశారు కేసీఆర్. ఈ నెల 18న (రేపు) ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు పిలుపునిచ్చారు కేసీఆర్.