రాష్ట్రంలో డెల్టా వేరియంట్ యాక్టివ్‌‌గా లేదు

రాష్ట్రంలో డెల్టా వేరియంట్ యాక్టివ్‌‌గా లేదు

పద్మారావునగర్, వెలుగు:రాబోయే కొద్ది నెలల్లో కరోనా థర్డ్‌‌వేవ్‌‌ వస్తుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కొవిడ్‌‌ నోడల్‌‌ కేంద్రం గాంధీ హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్‌‌ డాక్టర్‌‌‌‌‌‌ రాజారావు సూచించారు. గురువారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా డబుల్‌‌ మ్యుటెంట్‌‌ డెల్టా వెరియంట్ యాక్టివ్‌‌గా లేదని చెప్పారు. రాష్ట్రంలో లాక్‌‌డౌన్‌‌ ఎత్తేయడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్‌‌ నెలల్లో రాష్ట్రంలో థర్డ్‌‌వేవ్‌‌ వచ్చే అవకాశం ఉందని, కొత్త మ్యుటెంట్లు కొంతమేర ప్రభావం చూపిస్తాయని తెలిపారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని, కరోనా రూల్స్‌‌ పాటిస్తే థర్డ్‌‌ వేవ్‌‌ నుంచి తప్పించుకోవచ్చన్నారు. పాండమిక్‌‌ చరిత్రలో ఆరు వేవ్‌‌లు వచ్చినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. థర్డ్‌‌వేవ్‌‌ను ఎదుర్కొనేందుకు తమ హాస్పిటల్‌‌ మెడికల్‌‌​టీమ్‌‌ రెడీగా ఉందని చెప్పారు. జులై మొదటివారం నుంచి గాంధీలో నాన్‌‌ ​కొవిడ్‌‌ వైద్య సేవలు స్టార్ట్‌‌ 
చేస్తామన్నారు. 
55 మంది డిశ్చార్జ్
కరోనా నుంచి కోలుకొని గురువారం 55 మంది డిశ్చార్జ్‌‌ అయ్యారని నోడల్‌‌​ అధికారి డాక్టర్‌‌‌‌ ప్రభాకర్​రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 603 మంది కరోనా పేషెంట్లు గాంధీలోని ఐసీయూ, వెంటిలేటర్‌‌‌‌ వార్డుల్లో ట్రీట్‌‌మెంట్‌‌ పొందుతున్నారని, ఇందులో 241 మంది బ్లాక్​ ఫంగస్​ బాధితులున్నారని చెప్పారు.