బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించాలి

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించాలి

బాసర ట్రిపుల్ ఐటీలో తమ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సబిత ఇంటి ముందు భారీగా మోహరించారు. మంత్రిని కలవాలని కోరుకుంటున్నట్లు... అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సౌకర్యాలు కల్పించకపోతే తమ పిల్లలకు సర్టిఫికేట్స్ ఇచ్చి... ట్రిపుల్ ఐటీని మూసివేయాలని సూచిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. వీరి సమస్యలు పరిష్కరించాలని ఎల్ బినగర్ లో పేరెంట్స్ సమావేశమయ్యారు. విద్యార్థుల 12 డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

45 రోజుల్లో సమస్యలను తీరుస్తామని చెప్పినా.. రెండు నెలలవుతున్నా.. ఇంతవరకు ఎలాంటి సమస్యలు తీర్చలేదన్నారు. ఓ వినతిపత్రం ఇవ్వాలని తాము ఇక్కడకు రావడం జరిగిందన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ.. ట్రిపుల్ ఐటీ  E1, E2 విద్యార్థులు శనివారం రాత్రి నుంచి నిరసన చేస్తున్నారు. శనివారం రాత్రి భోజనం చేయకుండా తెల్లారి 3 గంటల వరకు మెస్ లో జాగారం చేశారు. ఉదయం నుంచి  బ్రేక్ ఫాస్ట్ కూడా చేయకుండా ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఐదు డిమాండ్లపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదు డిమాండ్లలో ఒకటైన మెస్ ఇష్యూపై వెంటనే స్పందించి.. మెస్ టెండర్లు పిలిచారు. మిగితా 4 డిమాండ్లపై నిలదీస్తున్నారు విద్యార్థులు.