రాష్ట్రంలో నమోదైన వర్షాపాత వివరాలు

రాష్ట్రంలో నమోదైన వర్షాపాత వివరాలు

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన  24 గంటల్లో రాష్ట్రంలోని పలు పలు ప్రాంతాల్లో నమోదైన వర్షాపాత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని ఆమకొండలో 22.2 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం నమోదవగా... కరీంనగర్ జిల్లాలోని గుండీలో 21.2 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ లో 18.8 సెంటీమీటర్ల అతి భారీ వర్షం నమోదవుగా... అదే నిజామాబాద్ లోని ఆలూరులో 16.6, నిర్మల్ లోని పెంబిలో 16.5, జగిత్యాల లోని కోరుట్లలో 16.3 , పెద్దపల్లిలోని ఎలిగాడులో 16.6, నిజామాబాద్ లోని రంజల్లో 15.5, పెద్దపల్లిలోని ధర్మారం లో 15.3, నిర్మల్ లోని వానల్ పహాడ్ లో 15.1, జగిత్యాల్లోని కథలాపూర్ లో 15, జగిత్యాల 15, నిజామాబాద్ లోని మోర్తాడ్ లో 15 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదు అయ్యింది. 

అలాగే  జగిత్యాల లోని పేగడపల్లిలో 14.9, నిజామాబాద్ లోని మదనపల్లిలో 14, నిజామాబాద్ లోని బాల్కొండలో 14.6, నిజామాబాద్ లోని వైల్పూర్లో 14.4, అదిలాబాదులోని నేరేడుగొండలో 14.1, నిజామాబాద్ లోని మెండోరా లో 13.9, నిర్మల్ లోని వాద్యాల్లో 13.7 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కురిశాయి. ఇక సిటిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. గాజులరామారం, శేర్లింగంపల్లి, కూకట్పల్లి ,చందానగర్, మూసాపేట్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి, ఖైరతాబాద్ ఏరియాలో దాదాపు ఒక సెంటీమీటర్లు వర్షాలు కురిశాయి.