
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నారు.
బుధవారం హైదరాబాద్ చేరుకున్న సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్ ధర్మేంద్ర శర్మ, నితీశ్ కుమార్ వ్యాస్, ఆర్ కే గుప్తాలతో ఈసీ సీఈవో వికాస్ రాజ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కమిషనర్లు, ఎస్పీలు, కలెక్టర్లతో ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం కానున్నారు.